Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాత్రంతా రూ.2కోట్లతో మస్తు మజా.. వరుసగా అమ్మాయిలను పిలిపించుకుని?

Updated: ఆదివారం, 14 ఏప్రియల్ 2019 (10:55 IST)
అకౌంటెంట్ పనిచేసే ఓ ఉద్యోగి జల్సాలు చేశాడు. దాదాపు రెండు కోట్ల రూపాయలు నొక్కేసిన ఆ అకౌంటెంట్.. తాను పట్టుబడతానని తెలుసుకుని అప్రమత్తమయ్యాడు. పట్టుబడేందుకు ముందే.. ఆ డబ్బుల్ని ఖర్చు చేయాలనుకున్నాడు. అంతే అనుకున్నంత పని చేశాడు.
 
అంతే ఖరీదైన నైట్ క్లబ్‌లో ప్రైవేట్ రూమ్‌ను బుక్ చేయించుకున్నాడు. ఒక రాత్రంతా ఒకరి తర్వాత ఒకరిగా అమ్మాయిలను పిలిపించుకున్నాడు. ఇలా పదిమందిని పిలిపించుకుని వారితో కలిసి ఖరీదైన డ్రగ్స్ తీసుకుంటూ ఎంజాయ్ చేశాడు. ఉదయం 9 గంటల సమయానికి రెండు కోట్లనూ ఖర్చు చేసేసి తన కారులో ఎంచక్కా ఇంటికి వెళ్లిపోయాడు. 
 
ఆపై పోలీసులకు పట్టుబడ్డాడు. జైలులో ఊచలులెక్కిస్తున్నాడు. అతడి పేరు డారెన్. ఈ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. అకౌంటెంట్ కావడంతో ఎలాగూ జీతాల పంపిణీ తన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి, మొత్తం డబ్బును తన ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. అంత డబ్బుతో పారిపోలేనని భావించి, రాత్రికి రాత్రే జీవితాన్ని మస్తు మజా చేశాడు. డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు.

అన్నీ చూడండి

ప్రభాస్ చిత్రం పౌర్ణమిలోని తెలుగు పాటకు చైనీస్ నర్తకి నాట్యం ట్రెండింగ్ వీడియో

మమ్ముట్టి మూవీ ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ నుంచి వీడియో గ్లింప్స్

Fauzi Update: పోస్ట్‌ప్రొడక్షన్‌తో ఫౌజీ స్పీడ్.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ?

Sumanth: పవన్ కళ్యాణ్ గారికి వారాహి పాజిటివ్‌గా హెల్ప్ అయింది : సుమంత్

Anaswara Rajan look: కాకా చిత్రానికి అనస్వర రాజన్ హృదయం అని కితాబు

తర్వాతి కథనం
Show comments