శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (16:44 IST)

లండన్‌లో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ముప్పు

లండన్‌లో ఎయిర్ ఇండియా విమానానికి పెను ముప్పు తప్పింది. తుఫాను గాలులు, బీభత్స వాతావరణం కారమంగా హీత్రో ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానాన్ని పైలెట్లు విజయవంతంగా ల్యాండింగ్ చేశారు. ఆ ల్యాండింగ్‌కు సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 
సాధారణంగా వాతవరణం అనుకూలించని పక్షంలో విమానాన్ని ల్యాండింగ్ చేయడం చాలా కష్టం. ఒక విధంగా చెప్పాలంటే సాహసోభరితమైన విషయం కూడా పైలట్ అన్నింటినీ బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకోవాల్సి వుంది. ఏ కొంచెం అదుపు తప్పినా పరిస్థితులు మొత్తంగా చేజారిపోతాయి. 
 
ఇపుడు లండన్‌లో ఎయిర్ ఇండియా విమాన పైలెట్లు ధైర్యం చేసి అత్యంత క్లిష్టమైన వాతావరణంలో విమానాన్ని ల్యాండింగ్ చేశారు. విమానం ల్యాండింగ్ దశలో బ్యాలెన్స్ తప్పింది. భీకర గాలులతో విమానం అటూ ఇటూ ఊగిపోయింది. అయినప్పటికీ పైలెట్లు విజయవంతంగా ల్యాండింగ్ చేశారు.