శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 27 జనవరి 2019 (14:13 IST)

ఫిలిప్పీన్స్‌లో జంట పేలుళ్లు.. 27మంది మృతి.. 50మందికి గాయాలు

ఫిలిప్పీన్స్‌లోని రోమన్ కాథలిక్ చర్చిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన జంట పేలుళ్ళలో 27మంది మృతి చెందారు. మరో 50మందికి పైగా గాయపడ్డారు. ముస్లిం మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా ఉండే జోలో ప్రాంతంలోని కేథడ్రెల్ చర్చి సమీపంలో తొలి బాంబు పేల్చారు. ఆ తర్వాత చర్చి ఆవరణలో మరో పేలుడుకు పాల్పడ్డారు. 
 
ఉగ్రదాడిపై ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి డెల్ఫిన్ లోరెన్జనా స్పందించారు. ప్రార్థనాస్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులుగా ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటించలేదు. 
 
జోలో ద్వీపంలో అబు సయ్యఫ్ సంస్థ మిలిటెంట్ల ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఈ సంస్థను అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది. దీంతో తాజాగా జరిగిన దాడిని కూడా అబు సయ్యఫ్ సంస్థ పనేనని అధికారులు అనుమానిస్తున్నారు.