శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (14:16 IST)

గే మ్యారేజ్‌లపై ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది.. అంతే పెళ్లి రద్దైంది.. ప్రధాని కూడా?

ఆస్ట్రేలియాలో గే మ్యారేజ్‌లకు చట్టబద్ధత లేదు. అలాంటిది ఫేస్‌బుక్ ద్వారా స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించాలని ఓ యువతి కోరింది. అంతే ఆ ఫేస్‌బుక్ పోస్టు ఆమె వివాహాన్ని రద్దయ్యేలా చేసింది. సో

ఆస్ట్రేలియాలో గే మ్యారేజ్‌లకు చట్టబద్ధత లేదు. అలాంటిది ఫేస్‌బుక్ ద్వారా స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించాలని ఓ యువతి కోరింది. అంతే ఆ ఫేస్‌బుక్ పోస్టు ఆమె వివాహాన్ని రద్దయ్యేలా చేసింది. సోషల్ మీడియాలో చేసిన పోస్టే ఆమె కొంపముంచింది. ఇంకా ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి కూడా ఆ పోస్టును సమర్థించారు. దీంతో సదరు మహిళ ఖంగుతింది.
 
వివరాల్లోకి వెళితే.. స్వలింగ సంపర్క వివాహాలకు మద్దతిస్తూ ఓ యువతి ఎఫ్‌బీలో కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా వివాహాలకు సంబంధించి చట్టాల్లో మార్పులు అవసరమని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆపై తన  ప్రియుడిని వివాహం చేసుకునేందుకు బల్లారట్‌లోని చర్చికి వచ్చింది. 
 
వివరాలు తెలుసుకున్న మతపెద్దలు ఆమె ఫేస్‌బుక్ పోస్టు వివరాలు తెలియరావడంతో వారి పెళ్లిని రద్దు చేశారు. దీంతో స్వలింగ సంపర్కులపై ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన యువతి షాకైంది. అంతేగాకుండా ఆమె కామెంట్లపై ప్రధాని స్పందించారు. పెళ్లిని రద్దు చేసిన చర్చి నిర్ణయాన్ని స్వాగతించారు. పెళ్లిని ఆపి వారు మంచి పని చేశారని కొనియాడారు.