శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2022 (16:29 IST)

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 20 మంది మృత్యువాత

bomb blast
ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఇక్కడి రాయబార కార్యాలయం వద్ద జరిగిన ఈ దాడిలో ఇద్దరు రష్యా దౌత్య సిబ్బందితో సహా 20 మంది చనిపోయారు. 
 
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని తాలిబన్ పాలకులు స్వాధీనం చేసుకున్న తర్వాత వరుస బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడులు జరుగుతున్న విషయం తెల్సిందే. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా కాబూల్‌లోని రష్యా దౌత్య కార్యాలయం వద్ద జరిగిన పేలుడులో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. 

అలాగే, ఈ నెల 2న ఓ మసీదు వద్ద జరిగిన రెండు పేలుళ్ళలో 20 మంది చనిపోయారు.  వీరిలో ప్రముఖ మత నాయుకుడు మజిబ్ ఉల్ రహమాన్ అన్సారీ కూడా ఉన్నారు. మరో 200 మంది వరకు గాయపడ్డారు.

హెరాత్ నగరంలోని గుజర్గా మసీదులో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం ప్రార్థనల నిమిత్తం పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో వారిని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లు సంభవించాయి.