శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 అక్టోబరు 2023 (09:16 IST)

అమెరికాలో 19 అడుగుల అంబేద్కర్ విగ్రహం.. 14వ తేదీన ప్రారంభం

BR Ambedkar
BR Ambedkar
అమెరికాలోని మెరిలెండ్ ప్రావిన్స్‌లో 19 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహం వచ్చే 14వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ విగ్రహానికి 'స్టాట్యూ ఆఫ్ ఈక్వలిటీ' అనే పేరు పెట్టబడింది.13 ఎకరాలలో ఈ విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. 
 
అహ్మదాబాద్‌లో ఉన్న అతిపెద్ద సర్దార్ వల్లబాయ్ పటేల్ విగ్రహాన్ని రూపొందించిన శిల్పినే ఈ విగ్రహాన్ని రూపొందించారు. భారతదేశానికి వెలుపల అంబేద్కర్ విగ్రహాలలో అత్యంత ఎత్తైన విగ్రహం ఇది చాలా ముఖ్యమైనది. 
 
అక్టోబర్ 14వ తేదీన ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీని ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమెరికా, ప్రపంచంలోని వివిధ దేశాల నాయకులు పాల్గొన్నారు.