1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 29 అక్టోబరు 2022 (22:40 IST)

నాథ్‌ద్వారాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహం

Lord Shiva
రాజస్థాన్‌లోని నాథ్‌ద్వారాలో నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం 'స్టాచ్యూ ఆఫ్ బిలీవ్'. నాథ్‌ద్వారాలో 369 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం 'విశ్వ స్వరూపం' నిర్మాణం. ఈ శివుని విగ్రహం 32 ఎకరాల విస్తీర్ణంలో కొండపై నిర్మించబడింది, ఇది 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కనిపిస్తుంది.

 
10 ఏళ్లలో 50 వేల మంది ఈ శివుని విగ్రహాన్ని తయారు చేశారు. ఈ ఆకర్షణీయమైన విగ్రహం కోసం 3000 టన్నుల ఉక్కు, ఇనుము, 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటు, ఇసుకతో ఉపయోగించారు. విగ్రహం లోపలి నుంచి పైకి వెళ్లడానికి 4 లిఫ్టులు, మూడు మెట్లు మార్గాలు ఉన్నాయి.

 
250 కి.మీ వేగంతో వీస్తున్న గాలులు కూడా విగ్రహంపై ఎలాంటి ప్రభావం చూపవు. వర్షం, సూర్యకాంతి నుండి రక్షించడానికి, విగ్రహానికి జింక్ పూత, రాగి పెయింట్ చేయబడింది. విగ్రహం క్రిందిభాగం లోపల నిర్మించిన హాలులో 10 వేల మంది ఒక్కచోట చేరవచ్చు.