బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సోనారోకు మూడోసారి కరోనా పాజిటివ్వే...

Jair Bolsonaro
ఠాగూర్| Last Updated: గురువారం, 23 జులై 2020 (16:03 IST)
బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సొనారోకు మూడోసారి నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కూడా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన మరింత కాలం ఆస్పత్రిలోనే ఉండాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది. అంటే మరో మూడు వారాలపాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ రెండు వారాల్లో ఉన్న అన్ని పర్యటనలను ఆయన వాయిదా వేసుకున్నారు.

ప్రస్తుతం కరోనా కేసుల నమోదులో అమెరికా తర్వాత అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదైన దేశాల్లో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లాగానే బోల్సోనారో కూడా కరోనాను తేలికగా తీసుకున్నారు. కరోనాను సాధారణంగా వచ్చే ఒక ఫ్లూగా ఆయన అభివర్ణించారు.

వైద్య, ఆరోగ్య సంస్థుల సూచించినట్లు ఆయన మాస్క్‌లు ధరించలేదు. సామాజిక దూరం పాటించలేదు. ఆయన పార్టీలోని వారిని కలిసినప్పుడల్లా వారికి షేక్‌ హ్యాండ్స్‌ ఇస్తూ, ఆలింగనం చేసుకున్నారు. ఫలితంగా ఆయన జూలై 7వ తేదీన కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి ఆయన క్వారంటైన్‌లో ఉన్నారు.దీనిపై మరింత చదవండి :