బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 జూన్ 2021 (17:15 IST)

భర్త వద్ద వధువు వింత కోరిక.. శోభనాన్ని షూట్ చేయాలి.. ఫోటోగ్రాఫర్స్‌ను కూడా..?

ఓ నూతన వధువు భర్త చేత ఓ వింత కోరిక కోరింది. ఆ పెళ్లి కూతురు భర్తతో జరిగే శోభనాన్ని షూట్ చేయించాలని కోరింది.  అందుకు తగ్గ సరైన కెమెరా టీమ్ దొరికే వరకు శోభనాన్ని వాయిదా వేయాలని కోరింది. దీంతో ఖంగుతినడం ఆ భర్త వంతు అయ్యింది. ఈ ఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది.

ఇక చివరికి చేసేది లేక ఆ భర్త తన భార్య కోరికకి ఒప్పుకున్నాడు. అయితే.., తమ శోభనాన్ని ఫోటో షూట్ చేయించుకోవాలన్న కోరికకి ఓ బలమైన కారణం ఉందని ఆ పెళ్లి కూతురు చెప్పుకొచ్చింది.
 
"ఇంత కాలంగా నా వర్జినిటీని ప్రాణంగా కాపాడుకున్నాను. దాన్నిపొగొట్టుకునే క్షణం చాలా మధురమైనది. నా దృష్టిలోఅది పెళ్లి కన్నా కూడా ముఖ్యమైనది. అందుకే ఈ మధుర క్షణాలను ఫోటోలు, వీడియో రూపంలో దాచుకోవాలని అనుకుంటున్నానని ఆ పెళ్లి కూతురు చెప్పింది. ఇక ఈ ఫోటో షూట్ కోసం చాలా మంది ఫోటోగ్రాఫర్స్‌ను ఆమె ఆహ్వానించటం విశేషం. దీనిపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.