బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: బుధవారం, 16 జూన్ 2021 (17:26 IST)

కొత్త కోడలికి మెట్టు మెట్టుకు నోట్ల కట్ట, అత్త అదిరిపోయే వెల్కమ్...

కొత్త కోడలు ఇంటికి వచ్చిందంటే ఏం చేస్తారు..ఇంటి ముందు హారతి ఇచ్చి లోపలికి పిలుస్తారు. దిష్టి తీయడానికి గుమ్మడికాయను కొడుతుంటారు. వంద రూపాయలో.. లేకుంటే రెండు వందల రూపాయలో తట్టలో పెట్టి దిష్టితీసిన వారికి పెళ్ళికొడుకు ఇస్తుంటాడు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరిగింది.
 
ఇంటికి వచ్చిన కొత్త కోడలికి నోట్ల కట్టలతో స్వాగతం పలికింది అత్త. అంతేకాదు ప్రతి మెట్టుకు వందరూపాయల నోట్ల కట్టను చేతికి ఇస్తూ పువ్వులు చల్లుతూ స్వాగతం పలికారు. ఇంట్లోకి వెళ్ళేంత వరకు సుమారుగా ఎనిమిది మెట్ల వరకు ప్రతి మెట్టు ఎక్కినప్పుడు డబ్బుల కట్టలను ఇస్తూ వచ్చింది. 
 
ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్‌గా మారుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఒక నూతన జంట కరోనా నిబంధనలను అనుసరిస్తూ వివాహం చేసుకోగా చాలా సింపుల్‌గా కోడలిని ఇంటికి పిలిపించుకున్న అత్త.. ఇంట్లోకి వచ్చేటప్పుడు మాత్రం భారీగానే స్వాగతం పలికిందట. ఈ నోట్లకట్టలను చూసిన బంధువులు, ఆడపెళ్ళి కూతురు తరపు వారు ఆశ్చర్యానికి గురయ్యారట.