నాలుగో పెళ్లికి భర్తను సిద్ధం చేసిన ముగ్గురు భార్యలు.. ఎక్కడ? (video)
మన దేశంలో పెళ్లికాని ప్రసాద్‌లు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారికి అమ్మాయిలు లేక వివాహం చేసుకోవడం లేదు. కానీ, ఆ వ్యక్తి మాత్రం ఇప్పటికే మూడు వివాహాలు చేసుకున్నాడు. అయిన పెళ్ళిపై మోజు తీరలేదు. అందుకే నాలుగో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని తన ముగ్గురు భార్యల దృష్టికి తీసుకెళ్లగా వారు కూడా మనస్ఫూర్తిగా సమ్మతించారు. అంతేనా.. నాలుగో పెళ్లికి తమ భర్తను దగ్గరుడి సిద్ధం చేశారు. పైగా, నాలుగో భార్యను వెతికే పనికూడా ముగ్గురు భార్యలే స్వీకరించారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాకిస్థాన్‌లోని సైల్‌కోట్‌కు చెందిన 20 యేళ్ల అద్నన్‌కు ముగ్గురు భార్యలు, నలుగురు పిల్లలున్నారు. అద్నన్ 16 ఏండ్ల వయస్సులోనే పెండ్లి చేసుకున్నాడు. నాలుగేళ్ళ తర్వాత మరో యువతిని వివాహమాడాడు. గత యేడాది మూడో పెండ్లి చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా నాలుగో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన భార్యలు.. అద్నన్‌కు వధువును వెతికే బాధ్యత తమ భుజ స్కందాలపై వేసుకున్నారు.
పైగా, ఈ ముగ్గురు భార్యలు కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. ఆ ముగ్గురిలో ఎవరితో ఎక్కువ సేపు గడపాలనే నిర్ణయాన్ని కూడా భర్తకే వదిలేశారు. అతను ఎవరి వద్దకు వెళ్లినా తమకు అభ్యంతరం లేదని చెబుతున్నారు. కానీ, ఈ ముగ్గురు.. అద్నన్ తమని సరిగా చూసుకోవడం లేదనే ఫిర్యాదు చేస్తున్నారు.
'నా కుటుంబ పోషణకు నెలకు రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలు ఖర్చవుతుంది. నేను పెళ్లి చేసుకున్న ప్రతిసారి నా ఆదాయం పెరుగుతున్నది. నా భార్యల పేర్లు సుంబాల్, శబానా, షహీదా. ఈ ముగ్గురు పేర్లు 'ఎస్' అక్షరంతోనే మొదలవుతాయి. కాబట్టి, నా నాలుగో భార్య పేరు కూడా 'ఎస్'తోనే మొదలు కావాలని కోరుకుంటున్నా' అని అద్నన్ అంటున్నారు.