శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: బుధవారం, 16 జూన్ 2021 (15:00 IST)

గ్రేట్ సిఎం స్టాలిన్, రోడ్డు మధ్యలో కాన్వాయ్ ఆపి...

తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ భద్రతా నియమాలను పక్కనబెట్టి ఒక వృద్థురాలి వినతి పత్రాన్ని స్వీకరించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ కాన్వాయ్ రహదారిపై వెళుతుండగా రోడ్డు పక్కనే నిలబడి ఉన్న ఒక వృద్ధురాలు కారును ఆపమని సైగ చేసింది. 
 
వెంటనే ఆమెను గమనించిన స్టాలిన్ తన కారును ఆమె వద్ద ఆపించారు. ఆ సమయంలో భద్రతా సిబ్బంది వాహనాలు సిఎం కారుకు వెనకా, ముందూ ఉన్నాయి. పక్కన సెక్యూరిటీ ఎవరూ లేరు. 
 
వృద్ధురాలు నేరుగా స్టాలిన్ వద్దకు వెళ్ళి వినతి పత్రాన్ని సమర్పించింది. ఈ లోపు భద్రతా సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురై సిఎం దగ్గరకు చేరుకున్నారు. ఆమె కోరిక మేరకు ఆమె ఇచ్చిన వినతి పత్రంపై సంతకం చేసి ఇచ్చి వెళ్ళిపోయారు స్టాలిన్. 
 
దీంతో సంతోషంతో ఆ వృద్ధురాలు మీరు నిండునూరేళ్ళు చల్లగా ఉండాలంటూ ఆశీర్వదించారు. గతంలో తమిళనాడు ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఈ విధంగా ముఖ్యమంత్రులు వాహనాలను ఆపి వినతిపత్రాలు తీసుకున్న దాఖలాలు లేవు. మొట్టమొదటిసారి స్టాలిన్ ఈవిధంగా చేయడంతో తమిళనాడు ఇది కాస్త పెద్ద చర్చకే దారితీస్తోంది.