సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 జనవరి 2020 (12:44 IST)

డోనాల్డ్ ట్రంప్ తల ఖరీదు రూ.575 కోట్లా?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తలకు ఇరాన్ ధరను నిర్ణయించింది. ట్రంప్ తలను తెచ్చి ఇచ్చినవారికి రూ.575 కోట్ల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది. ఇరాన్ మిలిటరీ కమాండర్ సులేమానీని అమెరికా సైనిక దళాలు హత్యచేసిన విషయం తెల్సిందే. దీంతో అమెరికా - ఇరాన్ దేశాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం సాగుతోంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధపరిస్థితులు నెలకొన్నాయి. 
 
సులేమానీ టెహ్రాన్‌లో సులేమాని అంతిమ‌యాత్ర కొన‌సాగింది. అక్క‌డ ట్రంప్ త‌ల‌పై వేలం విధించిన‌ట్లు తెలుస్తోంది. దేశంలోని ప్ర‌తి ఒక్క‌రూ ఒక డాల‌ర్ విరాళం ఇవ్వాల‌ని, దాంతో ట్రంప్ నివ‌సించే వైట్‌హౌస్‌పై దాడి చేస్తామ‌ని ఇరాన్ టీవీ ఛాన‌ళ్లు వార్త‌లు ప్ర‌సారం చేసిన‌ట్లు నివేదిక‌లు చెబుతున్నాయి. 
 
ఇరాన్‌లో సుమారు 8 కోట్ల జ‌నాభా ఉన్న‌ది. ఒక్కో పౌరుడు ఒక డాలర్ చొప్పున నగదు బహుమతి ఇస్తారని తెలిపారు. ప్రెసిడెంట్ ట్రంప్‌ను హ‌త‌మార్చిన వాళ్ల‌కు ఆ రివార్డును బ‌హూక‌రిస్తార‌ని ప్ర‌క‌టించారు. సులేమానీ హ‌త్య నేప‌థ్యంలో ఇరాన్‌, అమెరికా మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది. ఆ హ‌త్య‌కు ప్ర‌తీకారం తీర్చుకుంటామ‌ని ఇరాన్ ఇప్ప‌టికే హెచ్చ‌రించింది.
 
మరోవైపు తమ దేశం నుంచి అమెరికా బలగాలు వెంటనే వెళ్లిపోవాలని ఇరక్ పార్లమెంటు తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ట్రంప్ కొట్టిపారేశారు. ఇరాన్‌లో సైనిక స్థావరాల కోసం ఎంతో ఖర్చు చేశామని... ఆ మొత్తాన్ని చెల్లిస్తే తప్ప అక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జరుగుతున్న పరిణామాలన్నింటి నేపథ్యంలో, పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది.