శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 నవంబరు 2020 (14:41 IST)

డోనాల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించట్లేదు..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన డోనాల్డ్ ట్రంప్ తన ఓటమిని ఇంకా అంగీకరించకపోవడంపై 46వ అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన జో బైడెన్ స్పందించారు. ఎన్నికల ఓటమిని ట్రంప్ అవమానంగా భావిస్తున్నారని, అందుకే ఆయన అంగీకరించలేకపోతున్నట్లు బైడెన్ విమర్శించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌కు ట్రంప్ సర్కార్ అధికార బదలాయింపు చర్యలు చేపట్టడం లేదు. దీంతో బైడెన్ బృందం కూడా ట్రంప్ పట్ల విసిగిపోయింది. 
 
మరోవైపు ట్రంప్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. తాను ఓడినట్లు ప్రముఖ టీవీ ఛానళ్లు చెబుతున్నాయని, కానీ తాను అధ్యక్ష రేసులో గెలవనున్నట్లు ట్రంప్ తెలిపారు. వాస్తవానికి ఇప్పటి వరకు ఏ ఒక్క రాష్ట్ర ఫలితాన్ని కూడా ఎన్నికల అధికారులు సర్టిఫై చేయలేదు. 
 
ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ జరుగుతుంది. డిసెంబర్ 14వ తేదీన జరగనున్న ఎలక్టోరల్ కాలేజీ సమావేశం నాటికి దీనిపై క్లారిటీ తేలనుంది. వాస్తవానికి ట్రంప్ తనకు అవమానం జరిగినట్లు ఫీలవుతున్నారని బైడెన్ అన్నారు. కానీ ఇలాంటి వైఖరి అధ్యక్షుడి వారసత్వానిని తగదన్నారు. జనవరి 20 నాటిని అంతా తేటతెల్లమవుతుందన్నారు.