బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (14:18 IST)

ఎలన్ మస్క్ తల్లి.. అలా గ్యారేజ్‌లోనే నిద్రపోయిందా?

elon musk
elon musk
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలన్ మస్క్ తల్లి పరిస్థితి దారుణంగా మారింది. ఎలన్ మస్క్ తల్లి మయే మస్క్.. కొంతకాలం క్రితం టెక్సాస్‌లోని మస్క్ దగ్గరికి వెళ్లింది.
 
అయితే, అక్కడ సరైన నివాస వసతులు లేవు. దీంతో అక్కడి 'స్పేస్ ఎక్స్' కార్యాలయంలోని గ్యారేజ్‌లోనే నింద్రించినట్లు మయే మస్క్ తెలిపారు. ఆ ప్రదేశం వద్ద ఎలాంటి విలాసవంతమైన ఇండ్లు ఉండవని, అందువల్ల గ్యారేజ్‌లోనే నిద్రపోయానని చెప్పారు. 
 
మయే మస్క్ అమెరికాలో ప్రముఖ మోడల్ కూడా. ఉద్యమకర్తగా కూడా ఉన్నారు. మయేకు ముగ్గురు పిల్లలు.. ఎలన్, కింబల్, టోస్కా. ఆమె తన భర్త ఎర్రోల్ మస్క్ నుంచి విడాకులు తీసుకున్నారు.
 
భర్త నుంచి విడిపోయిన తర్వాత పిల్లల్ని పోషించేందుకు చాలా కష్టపడినట్లు తెలిపారు. గతంలో ఎలన్ మస్క్… తనకు సొంత ఇల్లు కూడా లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే.