గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (10:11 IST)

పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే... నటి సదా వివరణ

sadhaa
అపుడెపుడో "రాను రానంటూనే సిన్నదో..." అనే పాటను సినీ అభిమానులు వినేవుంటారు. హీరో నితిన్ నటించిన "జయం" చిత్రంలోనిది. ఇందులో హీరోయిన్‌గా సదా నటించారు. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన "అపరిచితుడు" చిత్రంలోనూ నటించారు. అయితే, ఆ తర్వాత ఈమెకు పెద్దగా సినీ అవకాశాలు రాలేదు. మధ్యలో రెండు మూడు చిత్రాల్లో నటించినప్పటికీ అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత బుల్లితెరపై న్యాయనిర్ణేతగా దర్శనమిచ్చారు ఇపుడు వెబ్ సిరీస్‌లపై దృష్టిసారించింది. అయితే, ఈమె ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. దీనికి కారణాన్ని తాజాగా సదా వెల్లడించారు. 
 
"నాకు పెళ్లి ఆలోచన లేదు. నన్ను పెళ్లి చేసుకునేవాడు నా సంపాదనపై ఆధారపడకూడదు. అలాంటివాడు నాకు ఇంతవరకు ఎదురుకాలేదు. అందుకే పెళ్లి చేసుకోలేదు" అని సెలవిచ్చారు. అయితే, ఆమె మాటలను చాలా మంది కొట్టిపారేస్తున్నారు. 
 
సదా వంటి అందమైన యువతిని పెళ్లి చేసుకునేందుకు చాలా మందే ఉన్నారు. పైగా, ఆమెను గడప దాటకుండ కంటికి రెప్పలా చూసుకునేవారు లేకపోలేదు. అయితే, సదా మాత్రం నా సంపాదనపై ఆధారపడకుండా ఉండేవాడు ఇంతవరకు తారసపడలేదని చెప్పడం విడ్దూరంగా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.