ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 మార్చి 2021 (09:41 IST)

జర్మనీలో ఏకంగా కరోనా థర్డ్ వేవ్.. ఏప్రిల్ 18 వరకు లాక్ డౌన్‌

ప్రపంచంలో కరోనా మళ్ళీ విజృంభిస్తోంది. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. యూరప్ దేశాల్లో పరిస్థితులు ఇప్పటి వరకు అదుపులోకి రాలేదు. ఇంగ్లాండ్‌లో జులై వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు జర్మనీలో ఏకంగా కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతోంది. 
 
థర్డ్ వేవ్ కావడంతో జాగ్రత్తలు తీసుకోవాలని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ పేర్కొన్నారు. ఏప్రిల్ 18 వరకు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ఛాన్సలర్ పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నా ప్రజల ప్రాణాలు కాపాడటం ముఖ్యమని, అందుకే లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు మోర్కెల్ పేర్కొన్నారు.
 
మరోవైపు జర్మనీ వ్యాప్తంగా ఏడు రోజుల వ్యవధిలో కరోనా పాజిటివ్ కేసులు 107శాతం మేర నమోదయ్యాయి. 68 వారాల తరువాత ఈ స్థాయిలో కరోనా కేసులు రికార్డ్ కావడం ఇదే తొలిసారి. 16 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అత్యధికంగా ఉంటోంది.
 
ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని సంపూర్ణ లాక్‌డౌన్‌ను విధించాల్సి వచ్చిందని ఏంజెలా మెర్కెల్ తెలిపారు. ఆయా రాష్ట్రాల స్థానిక ప్రభుత్వాధినేతలు, ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. వారిని సంప్రదించిన తరువాతే కంప్లీట్ లాక్‌డౌన్ విధించామని చెప్పారు.