శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

నేపాల్‌ను కుదిపేసిన భారీ భూకంపం - భూకంప లేఖినిపై 6.0గా నమోదు

earthquake
పొరుగు దేశం నేపాల్‌ను భారీ భూకంపం ఒకటి కుదిపేసింది. ఆదివారం ఉదయం 8.13 గంటల ప్రాంతంలో ఆ దేశ రాజధాని ఖాట్మండుకు 147 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. ఈ వియాన్ని నేషనల్ ఎర్త్‌కేక్ మానిటరింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ఈ భూకంప కేంద్రం ఇది భూమికి 10 కిలోమీటర్ల లోపల ఉన్నట్టు గుర్తించారు. అయితే, ఈ భూప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం సంభవించలేదని నేపాల్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. 
 
కాగా, నేపాల్ దేశంలో ఇటీవలి కాలంలో కాలంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. ఇవి భారీ, ఆస్తి నష్టాన్ని కలిగించాయి. గత 2015 ఏప్రిల్ 25వ తేదీన ఖాట్మండు, పోఖరా నగరాల్లో 7.8 తీవ్రతతో పెను భూకంపం సంభవించింది. ఇందులో దాదాపు 8,964 మంది నేపాలీయులు ప్రాణాలు కోల్పోగా, 22 వేల మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.