'హౌడీ మోదీ' ఎందుకింత ప్రత్యేకమంటే..!

ఆదివారం, 22 సెప్టెంబరు 2019 (17:12 IST)
అమెరికా హ్యూస్టన్లో ఆదివారం రాత్రి 8.30 నుంచి 11.30 గంటల వరకు (భారతీయ కాలమానం ప్రకారం) 'హౌడీ మోదీ' కార్యక్రమం జరగనుంది. ఎన్ఆర్జీ స్టేడియంలో జరుగనున్న ఈ ఆత్మీయ భేటీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

పోప్ తరువాత.. అమెరికాలో పర్యటిస్తున్న ఓ విదేశీ నాయకుడి కోసం ఇంత పెద్ద సభ నిర్వహిస్తుండడం ఇదే మొదటిసారి. ప్రవాస భారతీయులతో.. హౌడీ మోదీ అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఆదివారం హ్యూస్టన్లోని ఎన్ఆర్జీ స్టేడియంలో జరిగే 'హౌడీ మోదీ' కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఆత్మీయ భేటీలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 

హౌడీ మోదీ కార్యక్రమ వివరాలు..
అమెరికా హ్యూస్టన్లో ఆదివారం రాత్రి 8.30 నుంచి 11.30 గంటల వరకు (భారతీయ కాలమానం ప్రకారం) హౌడీ మోదీ కార్యక్రమం జరుగుతుంది. 'ది ఇండియన్-అమెరికన్ స్టోరీ' అనే సాంస్కృతిక కార్యక్రమంతో హౌడీ మోదీ ప్రారంభమవుతుంది.

అమెరికా సంస్కృతి, మేధో, సామాజిక రంగాలకు భారతీయ అమెరికన్లు చేస్తున్న కృషిని ఇది వివరిస్తుంది. 90 నిమిషాల ఈ సాంస్కృతిక ప్రదర్శనలో అమెరికా, టెక్సాస్లకు చెందిన 27 బృందాలు ప్రదర్శనలు ఇస్తాయి. భారతీయ-అమెరికన్ యువత గురించి 2 పాటలు ప్రదర్శిస్తారు.

'షేర్డ్ డ్రీమ్స్-బ్రైట్ ఫ్యూచర్' హౌడీ మోదీ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాల్గొంటారు. మొదటిసారిగా మోదీతో కలిసి సుమారు 50 వేల భారతీయ-అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 'షేర్డ్ డ్రీమ్స్-బ్రైట్ ఫ్యూచర్' ద్వారా భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం చేయడానికి కృషి చేయనున్నారు.

ప్రవాస భారతీయులు సాంస్కృతికంగా, మేధోపరంగా అమెరికాకు చేస్తున్న సేవలను ప్రస్తుతిస్తారు. ప్రేక్షకుల సౌలభ్యం కోసం మోదీ ప్రసంగానికి ఆంగ్ల అనువాదం అప్పటికప్పుడే స్మార్ట్ఫోన్ల ద్వారా అందిస్తారు. భారత్- అమెరికా ద్వైపాక్షిక బంధాల పురోభివృద్ధిపై జరగాల్సిన కృషిని గురించి ప్రసంగిస్తారు. 

అన్నీ చూడండి

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

Dil Raju: పావలా శ్యామలకు వైద్య చికిత్స చేయిస్తున్న నిర్మాత దిల్ రాజు

దత్తాత్రేయ స్వామి గుడిలో పెద్ది కథను రాసుకున్నా: బుజ్జిబాబు సానా

తర్వాతి కథనం
Show comments