ఏపీ భవన్‌లో ప్రత్యేక కమిషనర్‌గా ఎన్.వి. రమణారెడ్డి

nv ramanareddy
ఎం| Last Updated: గురువారం, 5 సెప్టెంబరు 2019 (15:53 IST)
ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రత్యేక కమిషనర్, ఎక్స్ అఫిషియో కమిషనర్‌గా ఎన్.వి. రమణారెడ్డి నియమితులయ్యారు. ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఐ.ఆర్.పి.ఎస్ (1986)బ్యాచ్ అధికారి అయిన ఎన్.వి.రమణారెడ్డి ఇండియన్ రైల్వేలోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రోటోకాల్ విభాగం సెక్రటరీగా, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు.

ప్రస్తుతం మాతృ సంస్థ అయిన ఇండియన్ రైల్వేలోని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ విభాగంలోపనిచేస్తూ తిరిగి డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన ఎన్.వి.రమణారెడ్డిని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రత్యేక కమిషనర్, ఎక్స్‌అఫీషియో కమిషనర్, టూరిజం శాఖ కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గురువారం ఉదయం రమణారెడ్డి తమ బాధ్యతలను స్వీకరించారు.దీనిపై మరింత చదవండి :