శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 జూన్ 2016 (13:09 IST)

హృతిక్ రోషన్ జస్ట్ మిస్.. ఇస్తాంబుల్ ఆత్మాహుతి దాడి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

హృతిక్ రోషన్ అభిమానులకో షాకింగ్ న్యూస్. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 36 మంది మృతి చెందగా.. వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నుంచి హృతిక్ రోష

హృతిక్ రోషన్ అభిమానులకో షాకింగ్ న్యూస్. టర్కీ రాజధాని ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఆత్మాహుతి దాడిలో 36 మంది మృతి చెందగా.. వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నుంచి హృతిక్ రోషన్ తన పుత్రులతో సహా తప్పించుకున్నారు. ఈ ఎయిర్ పోర్టు నుంచి హృతిక్ రోషన్ భారత్‌కు బయల్దేరిన కొద్దిసేపట్లోనే ఆత్మాహుతి దాడి జరిగింది. 
 
కానీ తాను క్షేమంగా ఉన్నానని.. ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హృతిక్ రోషన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఆత్మాహుతి దాడి నుంచి తృటిలో తప్పించుకోగలిగామని హృతిక్ తెలిపాడు. దాడి విషయం తెలిసి చాలా షాక్‌కు గురయ్యానని, బిజినెస్ క్లాస్ టికెట్లు దొరక్కపోవడంతో అంతకుముందే ప్రయాణించాల్సిన విమానం మిస్ అయ్యిందని, అయితే అక్కడి అధికారుల సహాయం వల్ల ఎకానమీ ఫ్లైట్ ద్వారా భారత్‌కు క్షేమంగా బయల్దేరామని హృతిక్ రోషన్ వెల్లడించారు. 
 
ఈ ఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. కాగా తన ఇద్దరు పుత్రులతో కలిసి స్పెయిన్, ఆఫ్రికాలకు విహారయాత్రకు వెళ్ళిన హృతిక్ రోషన్.. టర్కీ నుంచి భారత్‌కు బయల్దేరిన కొద్ది సమయంలోనే ఐసిస్ ఉగ్రవాదులు ముగ్గురు తమను తాము పేల్చుకుని విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో 36 మంది మృతి చెందగా 140 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.