శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 నవంబరు 2024 (12:21 IST)

ఇరాక్ గడ్డపై నుంచి ఇజ్రాయేల్‌పై మరోమారు దాడికి ఇరాన్ ప్లాన్

ఇజ్రాయేల్ - గాజా (పాలస్తీనా)ల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరాక్ కూడా జోక్యం చేసుకుంది. హమాస్‌ అధినేత ఇస్మాయెల్‌ హనీయా, హిజ్బుల్లా చీఫ్‌ సయ్యద్‌ హసన్‌ నస్రల్లా, ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన నిల్పోరూషన్‌ మరణానికి ప్రతీకారంగా నెల క్రితం ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకరంగా విరుచుకుపడిన విషయం తెలిసిందే. 200 మిస్సైళ్లతో దేశవ్యాప్తంగా దాడి చేయడంతో ఇజ్రాయేల్‌ ప్రజలు బంకర్లలో తలదాచుకున్నారు. 
 
దీంతో ప్రతీకార చర్యలు తప్పవన్న ఇజ్రాయేల్‌.. అన్నట్టుగానే ఇటీవల టెహ్రాన్‌పై దాదాపు 200 యుద్ధవిమానాలతో దాడికి దిగింది. డ్రోన్‌ ఫ్యాక్టరీలు, బాలిస్టిక్‌ క్షిపణి తయారీ, ప్రయోగ కేంద్రాలపై దాడి చేసింది. దీంతో మరోసారి ఉద్రిక్తలు పెరిగాయి. ఈ దాడికి ప్రతీకారం తప్పదని ఇరాన్‌ హెచ్చరించింది. అందులో భాగంగా దాడి ఘటన తమ దేశంపైకి రాకుండా ఉండేందుకు ఇరాక్‌ గడ్డ నుంచి ఇరాన్‌ చేపట్టనుందని నిఘావర్గాలు వెల్లడించాయి. 
 
ఇందులోభాగంగా, ఇటీవల ఇజ్రాయేల్‍పై ఇరాక్ సేనులు దాడికి తెగబడ్డాయి. ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రతికార దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ఇరాక్‌కు అపార నష్టం వాటిల్లింది. దీన్ని ఇరాక్ జీర్ణించుకోలేక పోతుంది. ఫలితంగా ఇజ్రాయేల్‌‍పై మరోమారు దాడికి పాల్పడేందుకు ఇరాన్ భారీగానే ప్లాన్ చేసింది. ఈ దాడులను ఇరాక్ గడ్డపై నుంచి చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. 
 
ఇరాక్‌ గడ్డ నుంచి ఇరాన్‌ ఈ దాడులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఇజ్రాయెల్‌ నిఘావర్గాల సమాచారం. నవంబరు 5వ తేదీ(ఈ నెల 5)న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందే ఈ దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇందుకోసం ఇరాక్ గడ్డపైకి భారీ సంఖ్యలో డ్రోన్లు, బాలిస్టిక్‌ మిస్సైళ్లు వినియోగించేందుకు టెహ్రాన్‌ చూస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇరాక్‌లోని ఇరాన్‌ అనుకూల మిలిటెంట్ల ద్వారా ఈ దాడిని చేపట్టేందుకు ఆ దేశం సిద్ధమవుతున్నట్లు సదరు నివేదిక పేర్కొంది.