Webdunia - Bharat's app for daily news and videos

Install App

జపాన్ ప్రధాన మంత్రి షింజో అబేపై నెటిజన్ల ఫైర్

Written By సెల్వి
Updated: సోమవారం, 13 ఏప్రియల్ 2020 (13:44 IST)
Japan PM
జపాన్ ప్రధాన మంత్రి షింజో అబేపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని చెబుతూ ఓ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోపై  కొందరు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సోఫాలో కూర్చుని, కుక్క పిల్లను ఎత్తుకుని, టీ తాగుతూ, పుస్తకం చదువుతూ ఆయన సదరు వీడియోలో కనిపించారు. ప్రముఖ సంగీతకారుడు జెన్ హోషినో ఓ పాట పాడుతూ పెట్టిన వీడియోకి జపాన్ ప్రధాని ఈ మేరకు స్పందించారు.
 
అయితే కరోనా వైరస్ కారణంగా అనేక మంది ఇబ్బందులు పడుతుంటే... వారిని నిర్లక్ష్యం చేసే విధంగా అబే సందేశం ఉందంటూ కొందరు నెటిజన్లు విరుచుకుపడ్డారు. మీరెవరని అనుకుంటున్నారు.. అనే ట్యాగుతో షిబేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. 'ఓ వైపు ప్రాణాలు నిలబెట్టుకునేందుకు ప్రజలు పోరాడుతుంటే.. లగ్జరీ వీడియోలు చూపిస్తారా..? ఎవరూ ఏమీ చేయలేరు కానీ.. 'మీరెవరను కుంటున్నారు?' అని మాత్రం ఆశ్చర్యపోతారు..'' అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.
 
మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం షింజో అబేకి మద్దతుగా నిలబడ్డారు. ప్రధానమంత్రికి కూడా విశ్రాంతి సమయం ఉంటుందంటూ సమర్థిస్తున్నారు. కాగా  జపాన్‌లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్యం ఏడువేలు దాటినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.

అన్నీ చూడండి

నా కుమార్తెకు పెళ్లి చేసే వయసు వచ్చింది.. ఇపుడు నాకు పెళ్లేంటి? : సురేఖావాణి

Rashmika injured : తీవ్రంగా గాయపడ్డ రశ్మిక మందన్న, ఆరు వారాలు విశ్రాంతి

చేతబడులు, క్షుద్ర పూజల నేపథ్యంతో కాళాంకి భైరవుడు

Sudheer : మదర్ సెంటిమెంట్ తో సుధీర్స్ జోకర్, తల్లిగా అభిరామి

క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో రంగులు మార్చే మనిషి కకథగా నిరమ్ ట్రైలర్

తర్వాతి కథనం
Show comments