శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 11 ఆగస్టు 2019 (11:46 IST)

పంద్రాగస్టు : భారీ విధ్వంసానికి ఐసిస్ కుట్ర... ఉసిగొల్పుతున్న పాక్

ఈ నెల 15వ తేదీన భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ వేడుకల సమయంలో దేశంలో విధ్వంసానికి ఇస్లామిక్ సేట్ట్ ఉగ్ర సంస్థ ఐఎస్ఐఎస్ కుట్రపన్నింది. ఈ మేరకు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. 
 
ముఖ్యంగా, ఆగస్ట 15వ తేదీ కంటే ముందుగానే భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు ప్లాన్ వేశారని ఇంటెలిజెన్స్ అధికారులు భద్రతాదళాలను హెచ్చరించారు. బక్రీద్ ప్రార్థనల్లో పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఐబీ హెచ్చరించింది. ప్రభుత్వ సంస్థలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మెట్రో స్టేషన్లు, ఎయిర్‌పోర్టులను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. 
 
ముఖ్యంగా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 370 ఆర్టికల్ రద్దు తర్వాత పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నాయి. వీటికి ఐసిస్ కూడా తన వంతు సహకారం అందిస్తోంది. కాశ్మీర్‌ను విభజిస్తూ భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఉగ్రవాదులు రగిలిపోతున్నారు. 
 
పాకిస్థాన్ ప్రభుత్వం కూడా భారత్‌లో దాడులకు ఉగ్రమూకలను పురిగొల్పే విధంగా ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. కాశ్మీర్‌ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారత్‌లో పుల్వామా తరహా దాడులు మరిన్ని జరిగే అవకాశం ఉందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. ఈ క్రమంలో ఉగ్రమూకలు మరింత రెచ్చిపోనున్నాయని ఇంటెలెజెన్స్ అధికారులు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.