ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 జులై 2020 (09:49 IST)

కరోనా మహమ్మారి మమ్మలను ఏమీ చేయలేకపోయింది : కింగ్ జాంగ్ ఉన్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మమ్మలను ఏమి చేయలేకపోయిందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వ్యాఖ్యానించారు. దీనికి కారణం తమ దేశ పౌరుల పోరాట పటిమేనని గుర్తుచేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కరోనా మహమ్మారి విషయంలో ఉత్తర కొరియా ప్రజల పోరాటం అద్వితీయమని కొనియాడారు. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న వేళ, తన దేశాన్ని మాత్రం ఏమీ చేయలేకపోయిందని ఆయన అన్నారు. 
 
వర్కర్స్ పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్న ఆయన, వైరస్ పైనా, ఆరు నెలల నుంచి సరిహద్దులను మూసివేసిన విషయంపైనా చర్చించారు. వేలాది మందిని ఐసోలేషన్ లో ఉంచడం వెనుక జాతి భద్రత తమ దృష్టిలో ఉందన్నారు. 
 
పార్టీ జనరల్ కమిటీ తీసుకున్న దూరదృష్టి నిర్ణయాలతోనే కరోనాను జయించామని అన్నారు. జాతి యావత్తూ, స్వచ్చందంగా మహమ్మారిపై పోరాడిందని దేశ ప్రజలను ఆయన అభినందించారని కేసీఎన్ఏ పేర్కొంది. ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా మారలేదని, గరిష్ఠ అప్రమత్తత అవసరమని కిమ్ జాంగ్ ఉన్ వ్యాఖ్యానించారని ఆ దేశ అధికారిక న్యూస్ ఏజన్సీ కేసీఎన్ఏ పేర్కొంది.