ఆదివారం, 5 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: సోమవారం, 3 అక్టోబరు 2022 (12:57 IST)

భార్య చెప్పిన మాట.. జాక్ పాట్ కొట్టాడు.. మిలియనీర్‌గా మారిపోయాడు..

అమెరికాలో ఓ వ్యక్తికి జాక్ పాట్ కొట్టింది. ఇంటి సరుకులు తీసుకురావాలని భార్య నుంచి అప్పుడే మెసేజ్‌ వచ్చింది. అప్పటికే పని ఒత్తిడిలో అలిసిపోయిన మాకి అయిష్టంగానే ఓ స్టోర్‌కి వెళ్లాడు. కానీ అక్కడ కొన్న లాటరీతో అతడి దశ తిరిగిపోయింది. తాను కొన్న టికెట్లకే జాక్‌పాట్‌ దక్కడంతో మిలియనీర్‌గా మారిపోయాడు. మిచిగాన్‌ లాటరీలో అతడికి 190,736 డాలర్లు (దాదాపు రూ.1.5 కోట్లు) దక్కాయి. 
 
ఈ జాక్‌పాట్ తనకు దక్కుతుందని కనీసం ఊహింలేదంటూ ప్రెస్టోన్‌ మాకి హర్షం వ్యక్తం చేశాడు. భార్య మెసేజ్‌ చేయకుంటే స్టోర్‌కు వెళ్లేవాడినే కాదని, ఈ లాటరీ దక్కేది కాదన్నాడు. 'ఆఫీస్‌లో పని ముగించుకుంటున్న సమయంలో.. దారిలో ఉన్న స్టోర్‌ నుంచి సరుకులు తీసుకురావాలంటూ నా భార్య నుంచి మెసేజ్‌ వచ్చింది. దీంతో స్టోర్‌కి వెళ్లి సరుకులు కొన్న తర్వాత ఐదు లాటరీ టికెట్లు కూడా కొనుగోలు చేశా' అని తెలిపాడు. ఆ మరుసటి రోజే తనను జాక్‌పాట్‌ వరించిందని, అసలు నమ్మలేకపోతున్నానంటూ హర్షం వ్యక్తం చేశాడు.