సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 17 జూన్ 2018 (15:43 IST)

ఇంగ్లండ్‌లో ఘోరం- 18నెలల బాబును ఆరో అంతస్థు నుంచి పారేసింది.. ఎందుకంటే?

ఇంగ్లండ్‌లో ఘోరం జరిగింది. ఇంగ్లండ్‌లోని వెస్ట్ యార్క్‌షైర్‌లో ఓ మహిళ కన్నబిడ్డ పట్ల దారుణంగా వ్యవహరించింది. దేవుడు అడిగాడని తన కుమారుడిని బలిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని వెస్ట్‌ యార్క్

ఇంగ్లండ్‌లో ఘోరం జరిగింది. ఇంగ్లండ్‌లోని వెస్ట్ యార్క్‌షైర్‌లో ఓ మహిళ కన్నబిడ్డ పట్ల దారుణంగా వ్యవహరించింది. దేవుడు అడిగాడని తన కుమారుడిని బలిచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని వెస్ట్‌ యార్క్‌షైర్‌‌లోని ఓ అపార్టుమెంటులో తల్లితోపాటు జెమ్మా ప్రొక్టర్‌ ఆమె ముగ్గురు కుమారులు నివాసముంటున్నారు. జెమ్మా తన 16 ఏటనే మద్యానికి బానిసయ్యారు. 
 
పైగా ఆమె మానసిక వ్యాధితో బాధపడుతోంది. కొద్ది రోజులుగా దేవుడు తనతో మాట్లాడుతున్నాడని అందరితో జెమ్మా చెప్తుండేది. ఈ క్రమంలో ఉన్నట్టుండి.. తన 18 నెలల కుమారుడిని ఆమె తల్లి చూస్తుండగానే ఆరో అంతస్తు నుంచి విసిరివేసింది. షాకైన తల్లి వెంటనే పోలీసులకు సమాచారం అందించగా బండరాళ్ల మీద పడి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
 
తల్లి ఫిర్యాదు మేరకు జెమ్మాను విచారించిన పోలీసులు షాక్ అయ్యారు. కొద్దిరోజులుగా దేవుడు తనతో మాట్లాడుతున్నాడని, దేవుడు అడగబట్టే తన కుమారుడిని బలి ఇచ్చానని చెప్పింది. దీంతో ఆమెను మానసిక వ్యాధిగ్రస్తురాలిగా పరిగణించి అదుపులోకి తీసుకున్నారు.