Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

నేడు సంపూర్ణ సూర్యగ్రహణం... భారత్‌పై ప్రభావం ఉంటుందా?

అమెరికాలో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించనుంది. 1979 తర్వాత తొలిసారి ఏర్పడుతున్న ఈ అతిపెద్ద సూర్యగ్రహణం ప్రత్యక్ష ప్రసారానికి అమెరికా పరిశోధనా సంస్థ "నాసా" ఏర్పాట్లు చేసింది. ఈ సూర్యగ్రహణం అమెరికా

Written By pnr
Updated: సోమవారం, 21 ఆగస్టు 2017 (06:47 IST)
అమెరికాలో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం కనిపించనుంది. 1979 తర్వాత తొలిసారి ఏర్పడుతున్న ఈ అతిపెద్ద సూర్యగ్రహణం ప్రత్యక్ష ప్రసారానికి అమెరికా పరిశోధనా సంస్థ "నాసా" ఏర్పాట్లు చేసింది. ఈ సూర్యగ్రహణం అమెరికా అంతటా కనిపించనుంది. 
 
ఒరెగాన్ నుంచి దక్షిణ కరోలినా వరకు 14 రాష్ట్రాల మీదుగా మొత్తం 90 నిమిషాల్లో సూర్యగ్రహణ ఛాయ మాయం కానుంది. ది గ్రేట్ అమెరికన్ ఎక్లిప్స్‌గా పిలుస్తున్న ఈ అరుదైన సూర్యగ్రహణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇందుకోసం 50 భారీ బెలూన్లను ఆకాశంలోకి పంపనుంది.
 
సూర్యగ్రహణం ఏర్పడే సమయంలో అత్యంత నాణ్యతతో కూడిన వీడియోలను, చిత్రాలను అందించే కెమెరాలను అమర్చిన బెలూన్లను దాదాపు 80వేల అడుగుల ఎత్తు వరకు పంపిస్తారు. ఈ కెమెరాల ద్వారా గ్రహణ దృశ్యాలను చిత్రీకరించి లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. 
 
సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు ఆరుగంటలపాటు సాగే గ్రహణం అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లోమాత్రమే కనిపించనుంది. అయితే, అది భారత్‌లో రాత్రి సమయం. అందువల్ల ఇండియాలో కనిపించే అవకాశం లేదు. ఫలితంగా ఈ సూర్యగ్రహణ ప్రభావం భారత్‌పై ఏమాత్రం ఉండదు. 
 
కాగా, సూర్యగ్రహణం సమయంలో భారీ భూకంపాలు, సునామీలు సంభవించే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఇప్పటికే అమెరికాను టోర్నడోలు ఓ కుదుపుకుదుపుతున్నాయి. 
About Author
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

Vijay Deverakonda: చారిత్రకథాంశంగా విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ డేట్ ప్రకటన

ఈశ్వర్ రాచి రాజు నటిస్తున్న చిత్రంలో నర్తకి పాత్రలో పూజిత పొన్నాడ

Prashanth Neel: ప్రశాంత్ నీల్ సమర్పిస్తున్న హారర్ థ్రిల్లర్‌ 418 రిలీజ్ డేట్ ఫిక్స్

Babumohan: చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా పోతిరెడ్డిపల్లి మూవీ ప్రారంభం

వెంకటేష్ - త్రివిక్రమ్ చిత్రం ఆదర్శ కుటుంబం విడుదల వాయిదా

తర్వాతి కథనం
Show comments