సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By Selvi
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (13:40 IST)

శ్రావణమాసం, సోమవారం, అమావాస్య, సూర్యగ్రహణం నాలుగూ ఒకే రోజు.. ఇలా చేయండి

శ్రావణమాసం, సూర్యగ్రహణం, అమావాస్య, సోమవారం ఈ నాలుగు ఏకంగా ఒకే రోజు రావడం అరుదు. అలాంటి రోజు ఈ నెల 21వ తేదీన రానుంది. ఈ రోజున శివుడిని పూజించడం ద్వారా.. అభిషేకం చేయించడం ద్వారా పాపాలు హరించుకుపోతాయి. చ

శ్రావణమాసం, సూర్యగ్రహణం, అమావాస్య, సోమవారం ఈ నాలుగు ఏకంగా ఒకే రోజు రావడం అరుదు. అలాంటి రోజు ఈ నెల 21వ తేదీన రానుంది. ఈ రోజున శివుడిని పూజించడం ద్వారా.. అభిషేకం చేయించడం ద్వారా పాపాలు హరించుకుపోతాయి. చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు హరిస్తాయి. ఆగస్టు 21వ తేదీ సోమవారం అమావాస్య. ఈ రోజును సోమావతి అమావాస్య అంటారు. 
 
ఈ రోజు కోసం నవగ్రహాలు, సప్తరుషులు, ముక్కోటి దేవతలు ఎదురుచూస్తారని.. ఈ రోజు మహాశివరాత్రి కంటే అత్యుత్తమైన రోజని చెప్తారు. ఇంకా శ్రావణంలో వచ్చే సోమావతి అమావాస్య రోజైన ఈనాడు శివుడికి మహాలింగార్చన చేయడం ద్వారా పుణ్య ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఆ రోజంతా ఉపవసించి.. సాయంత్రం పూట శివార్చన చేయడం మంచి ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.