శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 2 నవంబరు 2016 (12:13 IST)

పిల్లల ముందే.. గర్భంగా ఉన్న ప్రేయసిపై రేప్: ఆపై రాడ్‌తో కొట్టి చంపేశాడు..

ప్రేయసిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను దారుణంగా కొట్టి చంపేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కామాంధుడైన ఆ కీచకుడు గర్భవతి అయినా.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అమెరికా నగరంలోని ఆమ్‌స్టర్‌డామ

ప్రేయసిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను దారుణంగా కొట్టి చంపేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. కామాంధుడైన ఆ కీచకుడు గర్భవతి అయినా.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అమెరికా నగరంలోని ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్‌కు చెందిన మైఖేల్ డాన్ యెల్లీ నార్వుడ్ అనే 39 ఏళ్ల వ్యక్తి ఆమ్‌స్టర్‌డామ్‌ నగరానికి చెందిన 30 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్‌ బెత్ అన్ లోగాన్‌పై అత్యాచారం చేశాడు. ఆపై మూర్ఖంగా ప్రవర్తించాడు. ఆమె తలపై రాడ్‌తో కొట్టి చంపాడు. మైఖేల్ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన గర్భిణీ అయిన బెత్ అన్ తీవ్రంగా గాయపడి అల్బానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఐదు రోజుల తర్వాత మరణించింది. ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా మృతి చెందింది.
 
తాను చేసిన ఘోరమైన నేరాన్ని నిందితుడైన మైఖేల్ మాంట్ గోమేరి కౌంటీ కోర్టు ముందు అంగీకరించి ప్రాసిక్యూటర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం వల్ల ఆయనకు 25 ఏళ్ల జీవిత ఖైదు విధించే అవకాశం ఉందని కోర్టు వర్గాలు వెల్లడించాయి.
 
కాగా.. 30 ఏళ్ల బెత్ అన్‌ను మార్చి 28వ తేదీన మైఖేల్ రేప్ చేశాడు. బెత్ అన్‌ నలుగురు పిల్లల (9-13 ఏళ్లలోపు వారు) ముందే.. ఆ కామపిశాచి అత్యాచారానికి పాల్పడి.. రాడ్‌తో దాడికి పాల్పడ్డాడు.