శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 17 జూన్ 2019 (17:16 IST)

నైజీరియాలో విజృంభించిన ఉగ్రమూకలు.. ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తుంటే?

నైజీరియాలో ఉగ్రమూకలు విజృంభించారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షిస్తున్న క్రీడాభిమానులపై ప్రమాదకర బోకోహరాం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 40 మందికి గాయాలైనాయి. నైజీరియాలోని బోర్నో రాష్ట్ర ముఖ్యనగరం మైదుగురి సమీపంలో ఈ దాడి జరిగింది. 
 
కొందరు ఫుట్‌బాల్  అభిమానులు వీడియో థియేటర్‌లో లైవ్ మ్యాచ్ చూస్తుండగా ఈ దురాగతం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అక్కడి వీడియో ఆపరేటర్‌తో గొడవపెట్టుకుని తనను తాను పేల్చుకున్నాడు. మరో ఇద్దరు ఉగ్రవాదులు మ్యాచ్‌ను వీక్షిస్తున్న ప్రజల మధ్యకు వెళ్లి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.  ఇది బోకోహరాం ఉగ్రవాదుల పనేనని నైజీరియా ప్రభుత్వం ప్రకటించింది.