సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 డిశెంబరు 2022 (13:01 IST)

ప్రజలు నవ్వకూడదు, ఏడవకూడదు, షాపింగ్ చేయకూడదు..?

ఉత్తరకొరియాలో వింతైన కఠిన నియమాలు అమలులోకి వచ్చాయి. ఉత్తర కొరియా ప్రజలు నవ్వకూడదు, ఏడ్వకూడదు, షాపులకు వెళ్లి వస్తువులు కొనకూడదు అనే అర్థరహిత కఠిన నియమాన్ని ఆ దేశ సర్కారు ప్రకటించింది. ఈ నియమాన్ని ఉల్లంఘించినట్లైతే ప్రాణాపాయం తప్పదని ఉత్తరకొరియా హెచ్చరించింది. 
 
ఉత్తర కొరియాలో కఠినమైన ఆంక్షలు అమలులో వున్న సంగతి తెలిసిందే. ఆ దేశ ప్రజల ప్రాధమిక హక్కులను కూడా ఆ దేశ సర్కారు కాలరాస్తోంది. తాజాగా నవ్వడం, ఏడవడం, షాపింగ్ చేయడం కూడదని ఉత్తర కొరియాలోని కిమ్ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. కిమ్ జోంగ్-ఉన్ తండ్రి కిమ్ జోంగ్-ఇల్ 10వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 17 నుండి 11 వరకు దేశంలో సంతాపం ప్రకటించారు. కాబట్టి ఈ 11 రోజుల్లో ఎవరూ నవ్వకూడదు, ఏడవకూడదంటూ చాలా కఠినమైన ఉత్తర్వు జారీ చేయబడింది. 
 
ఈ 11 రోజుల్లో కుటుంబంలో ఎవరైనా చనిపోయినా బంధువులు ఏడవకూడదు. అతని అంత్యక్రియలు కూడా 11 రోజుల తర్వాత నిర్వహించాలని కఠినమైన నిబంధనలను జారీ చేసింది. బహుశా, ఎవరైనా ఈ 11 రోజులలోపు జన్మించినట్లయితే, వారు తమ జీవితాంతం పుట్టిన రోజు జరుపుకునే వీలుండదని ఆ దేశ పత్రికలు ఊటంకించాయి.