సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 మే 2022 (15:53 IST)

భూతాపం.. హిమనీనదంతో వరద.. కూలిపోయిన బ్రిడ్జి

Hassanabad bridge
Hassanabad bridge
భూతాపంతో హిమ పర్వతాలు కరిగిపోయి ఆ నీళ్లతో వరదలు ముంచెత్తుతున్నాయి. అలాంటి ఘటనే పాకిస్థాన్‌లోని గిల్గిత్ బాల్టిస్థాన్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
 
గత శనివారం మౌంట్ షిష్పర్‌లోని షిష్పర్ గ్లేసియర్ (హిమనీనదం) కరిగిపోయి వరద ముంచెత్తింది. ఆ వరద ధాటికి కారాకోరం హైవేపై ఉన్న హసనబాద్ వంతెన కూలిపోయింది. భూతాపం వల్లే హిమనీ నదం కరిగిపోయి నీటి మట్టం పెరిగిందని పర్యావరణ నిపుణులు అంటున్నారు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పాకిస్థాన్ పర్యావరణ మార్పుల మంత్రి, సెనేటర్ షెర్రీ రెహ్మాన్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. అత్యధిక ఉష్ణోగ్రతలతో పాకిస్థాన్ కు ముప్పు పొంచి ఉందని కొన్ని రోజుల క్రితమే హెచ్చరించామని ఆమె గుర్తు చేశారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.