బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (12:39 IST)

ఆర్థిక సాయం చేయరా? ఇంటెలిజెన్స్ సమాచారం ఇవ్వం: పాకిస్థాన్

పాకిస్థాన్-చైనాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పాకిస్థాన్ ‌ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఆరోపిస్తూ ఆర్థిక సాయాన్ని అమెరికా నిర్ణయించుకుంది. ఈ నిర్ణయంపై పాకిస్థాన్ స్పందించింది. తమ దేశంలో అమెరికా సై

పాకిస్థాన్-చైనాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పాకిస్థాన్ ‌ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఆరోపిస్తూ ఆర్థిక సాయాన్ని అమెరికా నిర్ణయించుకుంది. ఈ నిర్ణయంపై పాకిస్థాన్ స్పందించింది.

తమ దేశంలో అమెరికా సైన్యానికి అందిస్తున్న సహాయ సహకారాలను వెనక్కి తీసుకుంటున్నట్లు పాకిస్థాన్ స్పష్టం చేసింది. అంతేగాకుండా అమెరికా సైన్యానికి తమ సైన్యం సహకరించబోమని పాకిస్థాన్ తేల్చి చెప్పేసింది. 
 
ఇకపై ఇంటెలిజెన్స్ సహకారాన్ని కూడా ఉపసంహరించుకుంటున్నామని పాక్ రక్షణ మంత్రి ఖుర్రం దస్తగిర్ ఖాన్ స్పష్టం చేశారు. పాక్ భూభాగంపై స్థావరాలను ఏర్పాటు చేసుకుని, ఐఎస్ఐ అందించే నిఘా నివేదికల ఆధారంగా ఆఫ్గనిస్థాన్ ఉగ్రవాదులపై యూఎస్ సైన్యం దాడులు నిర్వహిస్తోందన్న సంగతి తెలిసిందే.

ఆఫ్గన్‌లో యూఎస్ విజయానికి తమ సైన్యమే కారణమని ఖుర్రం ఖాన్ గుర్తు చేశారు. ఇప్పటివరకు అమెరికా తాము అందించిన సాయాన్ని మరిచిపోయిందన్నారు.