పబ్జీతో భారత్‌లో అడుగుపెడతాం.. సౌత్ కొరియా కంపెనీ
చైనాకు చెందిన 118 యాప్‌ల తొలగింపులో భాగంగా పబ్జీని కూడా ఇటీవల భారత ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ గేమ్ తయారు చేసిన సౌత్ కొరియా కంపెనీ స్పందించింది. తిరిగి భారత్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమౌతున్నట్టుగా తెలిపింది.
తాము పరిస్థితులను అన్నింటిని గమనిస్తున్నామని, త్వరలోనే భారత్‌లో అడుగుపెడతామని ధీమాగా చెప్తోంది. చైనా మూలాలు ఉండవు కాబట్టి త్వరలో ఈ గేమింగ్ యాప్‌పై నిషేధం తొలగిపోతుందని ధీమా వ్యక్తం చేసింది.
వాస్తవానికి పబ్జీ గేమ్‌ను సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ తయారు చేసింది. కానీ పబ్‌జీ మొబైల్ వర్షన్‌ను మాత్రం చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ ప్రమోట్ చేస్తోంది. దీంతో భారత్‌లో ఈ వర్షన్‌పై నిషేధం విధించారు. ఈ చర్యతో సౌత్ కొరియా కంపెనీ దిగివచ్చింది.
ఇక నుంచి తమ గేమింగ్ యాప్‌తో టెన్సెంట్ గేమ్స్‌కు ఎలాంటి సంబంధం ఉండదని ప్రకటించింది. రాబోయే రోజుల్లో పూర్తి బాధ్యతల్ని పబ్‌జీ కార్పొరేషన్ చూసుకుంటుందని స్పష్టం చేసింది.