మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 నవంబరు 2019 (15:31 IST)

డొనాల్డ్ ట్రంప్ ఎన్ని చేసినా సునామీలా పెరుగుతున్న హెచ్-1 బి వీసాల సంఖ్య

అమెరికాలో ఎక్కువ కాలం పనిచేసేందుకు అనుమతించే హెచ్ 1బిని సాధించడం అంత సులభం కాదు. ఇది అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక కఠినంగా మారింది. ఎన్ని కఠినతర నిబంధనలు విధించినా... వాటన్నిటినీ దాటుకొని అమెరికాలో కొలువు సంపాదించే వారి సంఖ్య పెరిగింది. 
 
కానీ అగ్ర రాజ్యానికి నిపుణుల కొరత అధికంగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితిలో కఠిన నిబంధనలు విధించి హెచ్ 1 బి వీసాలను జారీ చేస్తున్నారు. భారత్ సహా వివిధ దేశాలకు చెందిన నిపుణులు ట్రంప్ నిర్ణయాలతో ఆందోళన చెందారు. కానీ అధికారిక గణాంకాల ప్రకారం 2019 లో హెచ్ 1 బి వీసాల జారీ ఊహించిన దానికంటే అధికంగా ఉంది. దీంతో మన దేశానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఊపిరి పీల్చుకొంటున్నారు.
 
హెచ్ 1 బి వీసాల జారీ ప్రక్రియ 2015 నుంచి కఠినతరం ఐంది. ప్రతి ఏడాది ఎదో ఒక కొత్త నిబంధనతో డోనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ అభ్యర్థులకు చుక్కలు చూపింది. అయినప్పటికీ ... 2019 ఆర్థిక సంవత్సరంలో మంజూరు ఐన హెచ్ 1 బి వీసాల సంఖ్య ఏకంగా 3.89 లక్షలకు పెరిగింది. 2018 ఆర్థిక సంవత్సరం లో అమెరికా 3.35 లక్షల వీసాలు జారీ చేసింది.