బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2022 (11:27 IST)

ట్విట్టర్ సీఈవోగా నేను తప్పుకోవాలా? వద్దా? ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ పోల్

elon musk
మైక్రోమెసేజింగ్ యాప్ ట్విట్టర్‌ను తన సొంతం చేసుకున్న తర్వాత ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్... ట్విట్టర్‌లో అనేక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా, సరికొత్త మార్పులకు ఆయన శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ సీఈవోగా తాను ఉండాలా? వద్దా? అనే అంశంపై ఆయన ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఆయన ట్విట్టర‌లో ఓ పోల్ పెట్టారు. 
 
ఈ పోల్‌లో నెటిజన్లు వద్దంటే సీఈవో పోస్టు నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఈ పోల్‌కు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఫలితంగా సోమవారం ఉదయం వరకు 56 శాతం మంది తప్పుకోవడమే ఉత్తమమని సెలవిచ్చారు. మరో 44 శాతం మంది ట్విట్టర్ యూజర్లు మాత్రం సంస్థ సీఈవోగా మస్క్ కొనసాగాలని అభిప్రాయపడ్డారు. 
 
కాగా, గతంలో కూడా ట్విట్టర్ బ్యాన్ చేసిన వ్యక్తులను తిరిగి ఆహ్వానించే విషయంపై కూడా మస్క్ ట్విట్టర్‌లో పోల్ నిర్వహించారు. ఇందులో వచ్చిన ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌‌పై ట్విట్టర్ నిషేధం ఎత్తివేత కూడా ఇందులోభాగంగా తీసుకున్న నిర్ణయమే కావడం గమనార్హం.