1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 ఆగస్టు 2014 (11:46 IST)

స్వీట్ ఆరెంజ్‌తోనే కొట్టి చంపేశారు.. దక్షిణాఫ్రికాలో ఘోరం!

కత్తులతో మర్డర్లు చేస్తారని వినే వుంటాం.. అయితే కమలాపండ్లతో మర్డర్ చేయొచ్చని విన్నారా.. లేదు కదా అయితే ఈ స్టోరీ చదవండి. స్వీట్ కమలాపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తినేస్తుంటాం. అయితే ఈ స్వీట్ కమలాపండ్లతోనే ఓ మర్డర్ జరిగింది. 
 
దక్షిణాఫ్రికాలోని గ్రామీణ ప్రాంతంలో ఈ విచిత్రమైన హత్య జరిగింది. దక్షిణాఫ్రికాలోని కమలాపళ్ళ తోటల్లో కాయలు సేకరించే కూలీల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవే ఒక వ్యక్తి హత్యకు దారితీసింది. 
 
ఇద్దరు కూలీలు తమకు గిట్టని మరో కూలీని కమలాపళ్ళతో కొట్టి మరీ చంపేశారు. కమలాపళ్ళ గుట్ట పక్కనే ఇద్దరూ నిల్చుని ఎదురుగా వున్న వ్యక్తి మీద వరసబెట్టి విసిరారు. దాంతో ఆ వ్యవసాయ కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు.