సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జులై 2022 (14:53 IST)

పొట్టకూటి కోసం సెక్స్‌ వర్కర్లుగా మారుతున్న శ్రీలంక మహిళలు

romance
శ్రీలంకలో దుర్భర పరిస్థితులు కనిపిస్తున్నాయి. మహిళలు పొట్టకూటి కోసం సెక్స్‌ వర్కర్లుగా మారుతున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. పిల్లల కడుపు నింపేందుకు నిత్యావసరాలు, మందులకు డబ్బుల్లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో మహిళలు తమ దేహాలను తాకట్టు పెడుతున్నారు. 
 
ముఖ్యంగా టెక్స్‌టైల్ పరిశ్రమల్లో ప‌నిచేసే మ‌హిళ‌లు త‌మ ఉద్యోగాలు కోల్పోవ‌డంతో వేరే దారిలేక సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు. ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో టెక్స్ టైల్స్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది.
 
ఆర్థిక సంక్షోభంతో ఉద్యోగాలు కోల్పోవడంతో వీధిన‌ప‌డ్డామ‌ని మహిళలంటున్నారు. నిత్యావసరాల కోసం అక్కడి దుకాణదారులతో శృంగారంలో పాల్గొనాల్సి వస్తోందని చెప్తున్నారు.