సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 జులై 2022 (16:46 IST)

2024 తర్వాత ఈ గొట్టం బాబుకీ అదే పరిస్థితి : విజయసాయి రెడ్డి

vijayasai reddy
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేకు పట్టిన గతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కూడా పడుతుందని వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. 2024 ఎన్నికల తర్వాత గొటబాయకు పట్టిన గతే చంద్రబాబు అనే గొట్టబాయికి పడుతుందని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
2024 ఎన్నికల తర్వాత ఏమాత్రం తేడా వచ్చినా చంద్రబాబు సింగపూర్‌కు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇందుకోసం చంద్రబాబు కొన్నేళ్ల క్రితమే సింగపూర్‌లో ఓ హోటల్‌ను కొనుగోలు చేశారన్నారు. అలాగే, ఇక్కడకు పారిపోయేందుకు ఓ ప్రైవేట్ జెట్ కూడా సిద్ధంగా ఉంచుకున్నారని ఆరోపించారు. 
 
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేలా 2024 తర్వాత ఈ గొట్టం బాబుకీ అదే పరిస్థితి పడుతుందని గొట్టబాయ - గొట్టంబాబులిద్దరిదీ ఒకే మజిలీ సింగపూరేనంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.