బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

చంద్రబాబులా వెన్నుపోట్లు పొడిచి పైకిరాలేదు : ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి

ysrcp flag
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైకాపాకు చెందిన తంబళ్ళపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాను చంద్రబాబు తరహాలో వెన్నుపోట్లు పొడవలేదనీ, సొంతవారినీ మోసం చేసి పైకిరాలేదన్నారు. తమ కష్టంతో వృద్ధిలోకి వచ్చామని తెలిపారు. 
 
ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మదనపల్లెలో నిర్వహించిన మినీ మహానాడులో చంద్రబాబు తాను చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తే ప్రజాదరణ పొందలేరన్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. చంద్రబాబునాయుడు కూడా రాజీనామా చేసి కుప్పంలో లేదా తంబళ్లపల్లెలో తనపై పోటీచేసి గెలవాలని సవాల్‌ విసిరారు. 
 
మహానాడుకు వెళ్లకుండా తామెవరినీ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. తెదేపా జాతీయ కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్టు కూడా దక్కనీయమన్నారు. చంద్రబాబులా సొంతవారిని మోసం చేసి పైకిరాలేదని.. కష్టంతో పైకొచ్చిన కుటుంబం తమదని చెప్పారు.