గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 జులై 2022 (20:28 IST)

చంద్రబాబు వేలికి రింగ్.. ఆ రింగ్‌లో ఉన్న రహస్యమేంటి?

chandrababu ring
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చూపుడు వేలికి ప్లాటినం రింగ్ వచ్చి చేరింది. ఈ రింగులోని రహస్యాలను ఆయన వెల్లడించారు. అన్నమయ్య జిల్లా పరిధిలోని మదనపల్లిలో జరిగిన టీడీపీ మినీ మహానాడుకు హాజరైన సందర్భంగా ఈ ప్లాటినం ఉంగరం వెలుగుచూసింది. దీనిపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొనడంతో సమావేశం తర్వాత జరిగిన పార్టీ నేతల సమీక్షా సమావేశంలో ఈ ఉంగరం ప్రత్యేకతను చంద్రబాబు వివరించారు. 
 
తన వేలికి ప్లాటినం ఉంగరం కొత్తగా పెట్టుకున్న నిజమేనని, ఇది కేవలం ఉంగరం మాత్రమే కాదన్నారు. తన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడు తెలియజేసే పరికరమని చెప్పారు. ప్లాటినం ఉంగరంలో ఓ చిప్ ఉంటుందని, అది తన హార్ట్ బీట్, స్లీపింగ్ అవర్స్, ఆహారం, తదితర అంశాలన్నింటినీ రికార్డు చేస్తుందని తెలిపారు. ఆ వివరాలను ప్లాటినం ఉంగరం ఎప్పటికపుడు తన కంప్యూటర్‌కు పంపుతుందని కూడా ఆయన వెల్లడించారు. 
 
రోజూ నిద్రలేచిన తర్వాత కంప్యూటర్‌కు పంపిన రిపోర్టును చెక్ చేసుకుంటానని, అందులో రోజువారీగా చేయాల్సిన చర్యల్లో ఏదేని తప్పులు దొర్లివున్నట్టయితే దాన్ని సరిదిద్దుకుని, మరుసటి రోజు ఆ తప్పు జరుగకుండా చూస్తానని చెప్పారు. అలాగే, పార్టీ కార్యకర్తలు కూడా ఆరోగ్యంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చంద్రబాబు చెప్పారు.