1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జులై 2022 (11:57 IST)

నేటి నుంచి మూడు రోజుల పాటు రాయలసీమలో బాబు పర్యటన

chandrababu
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు రాయలసీమలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో జరిగే పార్టీ మినీ మహానాడుల్లో పాల్గొంటారు. అలాగే, జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు.
 
ఈ సందర్భంగా బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు రోడ్‌షోలు నిర్వహిస్తారు. ఇందుకోసం పార్టీ నేతలు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే చంద్రబాబు పర్యటన సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.