శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జూన్ 2022 (19:43 IST)

మహానాడు వాయిదా వేసిన చంద్రబాబు... కారణం ఇదే?

మహానాడు నిర్వహణపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండడంతో సభా ప్రాంగణమంతా చిత్తడిగా మారిందని పార్టీ నేతలు తెలిపారు. 
 
దీంతో సభ నిర్వహణ కష్టమని భావించిన నేతలు మహానాడును వాయిదా వేయడమే మంచిదని భావించారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పడంతో ప్రస్తుతానికి మహానాడును వాయిదా వేయాలని నిర్ణయించారు. 
 
మరో తేదీని ఖరారు చేయాలని పార్టీ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించే టీడీపీ మహానాడు వాయిదా పడింది.