గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 జులై 2022 (09:57 IST)

నాలుగు దశాబ్దాల తర్వాత నగరిపల్లెలో చంద్రబాబు

chandrababu
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రూ జిల్లాలోని నగరిపల్లెకు 40 యేళ్ల తర్వాత వచ్చారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఇంటికి చంద్రబాబు వచ్చారు. ఈ సందర్భంగా కిషోర్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఆతిథ్యాన్ని చంద్రబాబు స్వీకరించి, ఆయన కుటుంబ సభ్యులను పలుకరించారు. 
 
చంద్రబాబు 40 యేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో నగరిపల్లెకు వచ్చారు. ఆ తర్వాత ఇంతకాలానికి ఆయన ఆ గ్రామానికి రావడంతో గ్రామస్తులు సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు మహిళలు మంగళ హారతులు పెట్టి స్వాగతం పలికారు. 
 
కాగా, గతంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి, మాజీ మంత్రి నల్లారి అమర్నాథ్ రెడ్డిని కలుసుకునేందుకు ఈ గ్రామానికి వచ్చారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కావడం గమనార్హం.