ఏడాదికి ఒకసారి స్నానం చేసే భార్య.. భర్త ఏం చేశాడంటే..?
భార్యాభర్తలన్నాక ప్రతి విషయంలోను సర్దుకుపోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. చిన్న సమస్య వచ్చినా సర్దుకుపోయే మనస్తత్వం ఉంటేనే వారి కాపురం అన్యోన్యంగా సాగుతుంది. అలా లేకపోతే ఎవరి సంసారంలోనైనా కలహాలు వస్తాయి. అది తీవ్రతరం అయితే అది విడాకుల వరకు వెళుతుంది. అయితే ప్రపంచంలో ఎంతోమంది భార్యాభర్తలు అనేక కారణాల వల్ల విడాకులు తీసుకుంటూ ఉంటారు. వాటిలో కొంతమంది చెప్పే కారణాలు ఎదుటివారికి సిల్లీగా, ఫన్నీగా అనిపిస్తుంది.
తైవాన్‌లోని ఒక వ్యక్తి తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని కోర్టుకెక్కాడు. ఈ క్రమంలో కోర్టు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. తన భార్య ఏడాదికి ఒకసారి స్నానం చేస్తూ వచ్చేదట. ఆ చేసే స్నానం ఆరుగంటల పాటు చేసేదట. దంతాలు కూడా శుభ్రం చేసుకోవడం లేదట. ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను కాబట్టి రెండు సంవత్సరాలు కాపురం చేశానని, ఇక తన వల్ల కాదని చెప్పాడు భర్త. వ్యక్తిగత పరిశుభ్రత ఎవరికైనా అవసరం అంటూ జడ్జి విడాకులు ఇచ్చేశాడట.