సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 11 మార్చి 2022 (18:54 IST)

లీటర్ పెట్రోలు ధర రూ. 50 పెరిగింది, ఎక్కడో తెలుసా?

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఫలితంగా ప్రపంచ దేశాల్లో చాలా దేశాల ఆర్థిక పరిస్థితులు రకరకాలుగా మారిపోతున్నాయి. శ్రీలంకలో దీని ప్రభావం విపరీతంగా వుంది. అక్కడ లీటరు పెట్రోల్ ధరపై రూ.50 వడ్డిస్తున్నట్లు అక్కడి ఎల్ఐవోసి వెల్లడించింది.

 
ఈ నిర్ణయంతో శ్రీలంకలో లీటర్ పెట్రోలు ధర ఏకంగా లీటరు రూ. 254కి చేరింది. డీజిల్ ధర రూ. 214 అయ్యింది. పెట్రోలు, డీజిల్ పైన శ్రీలంక ప్రభుత్వం ఎలాంటి రాయితీలు ఇవ్వని కారణంగా ధరలు చుక్కలు చూస్తున్నట్లు తెలుస్తోంది.

 
కాగా పెట్రోల్ ధరలు పెరగడం నెలరోజుల్లో ఇది మూడోసారి. మరి ఉక్రెయిన్ సంక్షోభం మరికొన్నిరోజులు సాగితే శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ. 500 చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.