గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (19:03 IST)

కీవ్‌ సిటీని స్వాధీనం చేసుకునే రష్యా దాడులు.. 500 కిలోల బాంబులతో?

ఉక్రెయిన్ స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా అక్కడి జనావాసాలపై బాంబులతో విరుచుకుపడుతున్నాయి రష్యా వైమానిక దళాలు. ఏ క్షణంలో ఏ బాంబు వచ్చి పడుతుందోనన్న భయంతో ఉక్రెయిన్ ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పట్టుకుని జీవిస్తున్నారు. 
 
బాంబుల మోత వినిపిస్తే చాలు.. గజగజ వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్ జనావాసాలపై దాడులు చేయబోమని అంటూనే మరోవైపు బాంబులతో విచక్షణ లేకుండా దాడులకు పాల్పడుతున్నాయి.
 
తాజాగా రష్యా బలగాలు మరోసారి దారుణానికి పాల్పడ్డాయి. యుక్రెయిన్‌లో రాత్రి సమయంలో రెసిడెన్షియల్ భవనాలపై రష్యా బలగాలు దాడు\కు పాల్పడ్డాయి. 500 కిలోల బాంబులతో అమాయక ప్రజల ఇళ్లపై '       దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇద్దరు చిన్నారులు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
తాజాగా దక్షిణ ఉక్రెయిన్లోని అతిపెద్ద సిటీ అయిన ఖేర్సన్ను స్వాధీనం చేసుకున్నట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. రష్యా పాలమిలటరీ బలగాలు ఖేర్సన్లో బాంబుల వర్షం కురిపిస్తుండటంతో ఉక్రెయిన్‌ సైనికులతో పాటు, పౌరులు కూడా పెద్ద సంఖ్యలో మృతిచెందినట్టుగా తెలుస్తోంది..
 
ఇక, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ సిటీని స్వాధీనం చేసుకునే దిశగా ముందకు కదులుతున్నాయి రష్యా బలగాలు.. మరోవైపు ఖార్కివ్ నగరంపై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఖార్కివ్ లోని పోలీస్ బిల్డింగ్ ను పేల్చివేసినట్లుగా తెలుస్తోంది.
 
ఈ ఘటనలో పోలిస్ భవనం పూర్తిగా ధ్వసమైంది.. రష్యా దాడుల్లో కరాజిన్ నేషనల్ యూనివర్సిటీలోని ఓ భవనం కూడా ధ్వంసమైనట్లు ఆ దేశ హోం శాఖ వెల్లడించింది. 
 
కాగా, రష్యా బలగాలను తాము తీవ్ర స్థాయిలో ప్రతిఘటిస్తున్నామని.. ఇప్పటికే రష్యాకు చెందిన సైనికులు 6 వేల మంది మృతిచెందారని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు ప్రకటించిన విషయం తెలిసిందే.