ఆయిల్ రేట్లపై తీవ్ర ప్రభావం.. ప్రజల జేబులకు చిల్లులు
రష్యా-ఉక్రెయిన్ వార్ ఆయిల్ రేట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఏపీలో నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం సాకుగా చూపించి అక్రమార్కులు చీకటి వ్యాపారానికి తెరతీశారు.
కర్నూలు జిల్లాలో ఆయిల్ ధరలు పెంచి, ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఫిర్యాదులు రావడంతో ఆదోనీ, ఆత్మకూరులో విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు నిర్వహించారు.
సన్‌ఫ్లవర్ అయిల్స్‌ను ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు చేపట్టారు. దాడులు జరుగుతాయన్న ముందస్తు సమాచారంతో కొన్నిచోట్ల షాపులకు తాళాలు వేశారు వ్యాపారస్తులు.
కడప జిల్లాలో ఆయిల్ మిల్లులు, హోల్‌సేల్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు. ప్రొద్దుటూరులో వంటనూనె ఎక్కువ ధరలకు అమ్ముతున్నారనే ఫిర్యాదు రావడంతో ఆకస్మిక తనికీలు నిర్వహించారు.