సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 9 మార్చి 2018 (11:58 IST)

కిమ్ జాంగ్‌తో డొనాల్డ్ ట్రంప్ చర్చలు.. స్టెఫానీతో సంబంధం లేదన్న..?

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌తో చర్చలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సై అన్నారు. మే నెలలోపు ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. ఈ భేటీ పట్ల ట్రంప్, కిమ్ ఆసక్తి చూపుతున్నట్లు దక్షిణ కొరియా జాతీయ

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌తో చర్చలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సై అన్నారు. మే నెలలోపు ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. ఈ భేటీ పట్ల ట్రంప్, కిమ్ ఆసక్తి చూపుతున్నట్లు దక్షిణ కొరియా జాతీయ భద్రతా సలహాదారు వెల్లడించారు. ఉత్తర కొరియా అణు పరీక్షలు చేయడం.. ఆపై అమెరికా ఆంక్షలు పెట్టడం ద్వారా ఇరు దేశ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. 
 
ఇంకా ఇరు దేశాల మధ్య యుద్ధం జరుగుతుందేమోనని ప్రపంచ దేశాలు జడుసుకున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్.. కిమ్ సమావేశం ద్వారా యుద్ధ మేఘాలు తొలగించేందుకు అవకాశం ఉందని సౌత్ కొరియా జాతీయ భద్రతా సలహాదారు చుంగ్ ఈ యాంగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. మే నెలలోపు.. ట్రంప్-కిమ్ భేటీ వుంటుందని.. అందుకు డొనాల్డ్ ట్రంప్ కూడా అంగీకరించారని తెలిపారు. ట్రంప్‌ను కలిసేందుకు ఆయనతో చర్చలు జరిపేందుకు కిమ్ కూడా సన్నద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. 
 
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తనకు శారీరక సంబంధాలు ఉండేవని.. ఆ విషయాన్ని బయట పొక్కనీయకుండా వుండేందుకు తనకు ట్రంప్ న్యాయనాది మైఖేల్ కోహెన్ రూ. 1.30 లక్షల డాలర్లు ఇచ్చినట్లు చెప్తున్న పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫర్డ్ ఆరోపణలను ట్రంప్ ఖండించారు. ఆమెతో తనకెలాంటి సంబంధాలు లేవన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ట్రంప్ తోసిపుచ్చారని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి శారా సాండర్స్ తెలిపారు.